శాలిగౌరారం: శాలిగౌరారం మండల కేంద్రంలో శుక్రవారం పదో తరగతి పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు, మీసేవా కేంద్రాలు తెరిచే ఉన్నాయి. విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో సమీపంలో 144 సెక్షన్ అమలు ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా జీరాక్స్ సెంటర్ల నిర్వాహకులు షాపులను తెరిచే ఉంచారు. పోలీసులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. లీక్ అయిన ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో శాలిగౌరారానికి చెందిన కొంత మంది యువకులు సమీపంలోని జీరాక్స్ సెంటర్లలో జవాబు పత్రాలను జీరాక్స్ తీసుకుని పరీక్షా కేంద్రంలోనికి పంపించేందుకు తీవ్రంగా యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఫ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు
పరీక్షా సమయంలో తెరిచి ఉంచిన జీరాక్స్ సెంటర్లు