సంస్థాన్ నారాయణపురం : ప్రతి నీటిబొట్టు వృథాకాకుండా భూమిలోకి ఒడిసిపడుదామని, అందుకోసం నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు వేద్దామని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా వాటర్‌షెడ్ పనులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక, జనగాం గ్రామాల్లో వాటర్‌షెడ్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పుట్టపాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెక్‌డ్యాంలు, పర్యుక్యూలేషన్ ట్యాంకులు, ఇంకుడుగుంతలు నిర్మించడం ద్వారా నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకుతుందన్నారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంభించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించాలన్నారు. జిల్లాలోనే సంస్థాన్ నారాయణపురం మండలంలో 22 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయినట్లు తెలిపారు. జనగాం వాటర్‌షెడ్ ప్రాజెక్టు కింద వ్యవసాయ పరికరాల కొనుగోలు కోసం రూ.1.41కోట్లు మంజురైనట్లు తెలిపారు. జనగాంలో వాటర్‌షెడ్‌ను ప్రారంభించారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. నీటి పొదుపుపై కళకారులు, విద్యార్థులు నిర్వహించిన ఆటా–పాట కార్యక్రమం అలరించింది. అదే విధంగా మహిళల సంఘాలు ఏర్పాటు చేసిన చేనేత మొగ్గం, బుట్టల అల్లికలును పరిశిలించినారు. పధకంలో భాగంగా ఏర్పాటు చేసిన పుట్టపాకలో బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటవీ ఆధికారి పద్మజారాణి, భూగర్భగనుల శాఖ జిల్లా ఆధికారి జ్యోతికుమార్, వాటర్‌షెడ్ సంయుక్త కమిషనర్ నర్సింహులు, డీఆర్‌డీఓ పీడీ నాగిరెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, ఎంపీఓ నర్సింహులు, ఏపీఎం యాదయ్య, ఏపీఓ ప్రశాంతి, గ్రామ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి