భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉంటాయి. 50 కేంద్రాల్లో 8,632 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. సందేహాల నివృత్తికి సెల్ నంబర్ 90107 72080 ఏర్పాటు చేశారు. పరీక్షల కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలని అధి కారులు సూచిస్తున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను పరీక్షల రాష్ట్ర పరిశీలకులు రమణకుమార్ పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట డీఈఓ సత్యనారాయణ, ఏసీజీఈ రఘురాంరెడ్డి, ఎంఈఓ నాగవర్థన్‌రెడ్డి, సీఎస్, డీఓలు ఉన్నారు.
విద్యార్థులూ.. ఆల్ ది బెస్ట్
భువనగిరి : పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు కలెక్టర్ హనుమంతరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కచ్చితంగా పాస్ అవుతాం మని పాజిటివ్ ఆలోచనతో పరీక్షలు రాయాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. అదే విధంగా డీఈఓ సత్యనారాయణతో కలిసి ఎంఈఓలు, సీఎస్, డీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు.
టెన్త్ పరీక్షలకు అంతా సిద్ధం