బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ను ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా ప్రారంభించి మాట్లాడారు. రోగుల ఆరోగ్య సంరక్షణ, ఆస్పత్రి నిర్వహణలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వైద్యుల్లో ఒత్తిడి తగ్గించేలా వర్క్‌షాప్‌లో కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ రాహుల్ నారంగ్, వైద్యులు జాన్ అశోక్, బిపిన్ వర్గీస్, ప్రొఫెసర్ రేణుకాదేవి, లత, మాలతీష్, సురేష్‌మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.