సాక్షి,యాదాద్రి : బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు, పిలాయిపల్లి కాలువతో పాటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి సర్వే ల్యాండ్ రికార్డ్స్, సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి భూ సేకరణపై సమీక్షించారు. భూ సేకరణ జాప్యం కాకుండా చూడాలన్నారు. సర్వే ల్యాండ్ కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి జగన్నాథరావు, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు