సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత | - | Sakshi
Sakshi News home page

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

Mar 20 2025 2:02 AM | Updated on Mar 20 2025 2:01 AM

అంతరిక్ష యాత్రలో ఎంతో ధైర్యం ప్రదర్శించిన సునీత విలియమ్స్‌ నేటి యువతకు ఆదర్శం. గతేడాది

సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు వెళ్లిన ఆమె తొమ్మిది నెలల అనంతరం తిరిగి

బుధవారం తెల్లవారుజామున భూమి మీదకు వచ్చింది. అంతరిక్ష ప్రయాణాల శాసీ్త్రయ పురోగతి కోసం ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె భారతీయ సంతతికి చెందినవారు కావడంతో యావత్‌ దేశం జేజేలు పలుకుతోంది. ఐఎస్‌ఎస్‌కు వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చిన సునీతపై పలువురి ప్రముఖుల అభిప్రాయాలు.

– నల్లగొండ టూటౌన్‌, సూర్యాపేట టౌన్‌

అంతరిక్షవాసం నుంచి భూమి మీదకు వచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌

వ్యోమగామిగా ఎన్నో

విజయాలు ఆమె సొంతం

తొమ్మిది నెలల తర్వాత

క్షేమంగా తిరిగి రావడంతో

అంతటా సంబరాలు

ఖగోళ పరిశోధకురాలిగా

సాధించిన విజయం

ఒక భారతీయ అమెరికన్‌ వ్యోమగామిగా సునీత విలియమ్స్‌ ఖగోళ పరిశోధకురాలిగా 195 రోజుల 15 గంటల 40 నిమిషాల్లో సాధించిన విజయమిది. తన అంతరిక్ష ప్రయాణం శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్‌ గణిత రంగాల్లో ఉన్నవారికి ప్రేరణ కలిగిస్తుంది. ఆమె వారసత్వం భవిష్యత్‌ తరాలకు గొప్ప మార్గదర్శకంగా నిలువనుంది. – సీహెచ్‌. రమేష్‌,

పీజీ సెక్షన్‌ కోఆర్డినేటర్‌, ఎంజీయూ

ఆమె విజయాలు ఎందరికో స్ఫూర్తి

సునీత విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర నుంచి క్షేమంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సైన్స్‌ గురించి తెలుసుకోవాలనే ఆమె పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్‌లో శాస్త్రవేత్తలు కావాలనుకునే వారికి సునీతా విలియమ్స్‌ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. – డాక్టర్‌ ఎన్‌. భిక్షమయ్య,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎంజీయూ

అంతరిక్ష యాత్రలు.. ఆమెకే సొంతం

వ్యోమనౌకలో సాంకేతిక లోపంతో తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌ ఎట్టకేలకు భూమిని చేరడం అద్భుత ఘట్టం. అంతరిక్ష విజయాలు ఆమెకే సొంతం. తన ఆరోగాన్ని సైతం లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో అంతరిక్షంలో పరిశోధనలు చేసి తిరిగి రావడం విజయానికి ప్రతీక. – ఎస్‌. ఆదిరెడ్డి,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎంజీయూ

భారతదేశానికే గర్వకారణం

సునీత విలియమ్స్‌ అన్ని అడ్డంకులను అధిగమించి భూమి పైకి తిరిగిరావడం భారతదేశానికి గర్వకారణం. ఆమె అంతరిక్ష విజయాలు భారత సంస్కృతి పట్ల ఆమెకున్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. గణేష్‌ విగ్రహాన్ని సైతం ఆమె అంతరిక్షానికి తీసుకెళ్లడం భారతీయులకు ఆనందాన్ని ఇచ్చింది. – డాక్టర్‌ కె. సత్తిరెడ్డి,

ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఎంజీయూ

ఎంతో గర్వంగా ఉంది

సునీత విలియన్స్‌ భారత సంతతికి చెందిన మహిళ కావడం గర్వంగా ఉంది. ఒక మహిళ 286 రోజులు అంతరిక్షంలో గడపడం అసాధారణం. ఆమె మహిళలందరికీ గర్వకారణం. ఆమె త్వరగా కోసుకొని మామూలు స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆమె భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచారు. – ఎం. శ్రీనివాస్‌రెడ్డి,

ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

భావి భారత శాస్త్రవేత్తలకు ఆదర్శం

తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుని భూమి మీదికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్‌ భావిభారత శాస్త్రవేత్తలకు ఎంతో ఆదర్శం. అంతరిక్ష పరిశోధన పైన ఆసక్తి కలిగినటువంటి మహిళలకు ఆమె సాహసం ఎంతో స్పూర్తినిస్తుంది. – అంకతి వెంకన్న,

ఫిజిక్స్‌ టీచర్‌, ఉన్నత పాఠశాల, సూర్యాపేట

ఆమె ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది

సునీత విలియమ్స్‌ అంతరిక్షం ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఆమె చేసిన పరిశోధనలు మానవ జాతికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఆమె భూమి పైకి తిరిగి రావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన కృషి ప్రశంసనీయం.

– సుదర్శన్‌రెడ్డి, ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి

అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలల పాటు స్పేస్‌లో ఉండిపోయినా చెదరని ఆత్మ విశ్వాసంతో సునీత విలియమ్స్‌ తిరిగి భూమి మీదకు రావడం గొప్ప విజయాన్నే భావించాలి. అంతరిక్ష పరిశోధకురాలిగా సునీత విలియమ్స్‌ సాధించిన విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. – వీరస్వామి,

ప్రొఫెసర్‌, ఎంజీయూ

సునిత విలియమ్స్‌

తిరుగులేని మహిళ

అంతరిక్ష వాసం నుంచి సునీత విలియమ్స్‌ తిరిగి రావడం గొప్ప విజయం. రష్యా వ్యోమగామి పాలికోవ్‌ 437 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతరిక్షంలో తిరగగా, సునీత మాత్రం ఒకేచోట తొమ్మిది నెలలు ఉండి పరిశోధనలు చేసి తిరుగులేని మహిళా వ్యోమగామిగా ఖ్యాతిగడించింది. యువత సునీత విలియమ్స్‌ స్ఫూర్తితో ముందడుగు వేయాలి.

– ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, వైస్‌ చాన్స్‌లర్‌, ఎంజీయూ

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత1
1/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత2
2/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత3
3/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత4
4/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత5
5/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత6
6/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత7
7/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత8
8/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత9
9/9

సునీత.. స్ఫూర్తిదాయకం నీ ఘనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement