
యాదగిరి క్షేత్రంలో ఘనంగా హోలి సేవ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం హోలి సేవ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేసి, పారాయణం పఠించారు. ప్రధానార్చాకులు హోలి సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులపై రంగులు చల్లారు. ఆ తరువాత భక్తులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆచార్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.