
కొనేదాంట్లో కొట్టేస్తున్నారు!
వస్తు విక్రయాల్లో మోసం
ఫ వేయింగ్ మిషన్లలో తేడాలు
ఫ నాణ్యతకూ తిలోదకాలు
ఫ కనిపించని కల్తీతో ప్రజారోగ్యానికి ముప్పు
ఫ తనిఖీలకు దూరంగా అఽధికారులు
ఫ వినియోగదారులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని దుస్థితి
ఫ నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
భువనగిరి పట్టణంలో కొందరు వ్యక్తులు మొబైల్ వాహనంపై ఉల్లిగడ్డ కొనుగోలు చేశారు. అనుమానం రావడంతో వేరే షాప్‌కు వెళ్లి కాంటా వేశారు. ఐదు కిలోల బ్యాగులో 200 గ్రామాలు, పది కిలోల బస్తాలో 500 గ్రాముల వరకు తక్కువ వచ్చింది. వ్యాపారి కోసం చూడగా అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎర్ర ఉల్లిగడ్డ కిలో రూ.35, తెల్ల ఉల్లిగడ్డ రూ. 30 ఉంది.
మోటకొండూరుకు చెందిన లోడే పుష్పమ్మ భువనగిరిలోని ఓ బంగారం షాపులో 24 క్యారెట్‌ల బిస్కెట్ బంగారం కొనుగోలు చేసింది. స్వగ్రామంలోని స్వర్ణకారుని వద్ద చెవి కమ్మలు చేయించుకుంది. ఆ తరువాత మరో స్వర్ణకారుడి వద్ద పాత కమ్మలనే కొత్త డిజైన్‌తో తయారు చేయించుకుంది. కొంతకాలం తరువాత బంగారం కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షోరూమ్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. చెవి కమ్మలను తూకం వేయించగా 18 క్యారెట్‌లే ఉంది.

కొనేదాంట్లో కొట్టేస్తున్నారు!