
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన సికిని యాదగిరి(59) గ్రామంలో బార్బర్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలుండగా మొదటి భార్య చనిపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు. గతంలో ఆమె హోళీ రోజే మృతిచెందడంతో ఆమెను గుర్తు చేసుకుని మనస్తాపం చెందిన యాదగిరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్ రూమ్‌లోని ఇనుప చువ్వకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండవ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకా రం.. గురువారం రాత్రి 12గంటల సమయంలో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45సంవత్సరాలు ఉంటా యని తెలిపారు. చామనఛాయ రంగు, ఎత్తు 5.7 అంగుళాలు, అతని దగ్గర లభ్యమైన ఓటర్‌కార్డుపై అమిత్‌పహాన్, వెస్ట్ బెంగాల్ అని ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు.