
సాగర్‌ను సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీడియా మేనేజ్‌మెంట్‌పై ఈ నెల 15వ తేదీ వరకు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ కార్పొరేషన్(ఐటీఈసీ) వారు వివిధ దేశాల మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా నేపాల్, శ్రీలంక, గయానా, టాంజానియా, సూరినామ్ తదితర దేశాలకు చెందిన 28 మంది మీడియా ప్రతినిధులు బుధవారం నాగార్జునసాగర్‌కు వచ్చారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం లాంచీలో నాగార్జుకొండకు వెళ్లి అక్కడ మ్యూజియంను, బుద్ధవనంలోని జాతకవనం, స్థూపపార్కు, తపోవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీరి వెంట మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.