అర్హత లేకున్నా వైద్యం! | - | Sakshi
Sakshi News home page

అర్హత లేకున్నా వైద్యం!

Mar 7 2025 8:55 AM | Updated on Mar 7 2025 8:54 AM

దాడులు చేస్తున్నాం

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి వంటి మండలాల్లో దాడులు నిర్వహించి అర్హత లేకున్నా వైద్య సేవలందిస్తున్నట్లు గుర్తించాం. అర్హత, అనుమతి లేకుండా ఆస్పత్రులను నిర్వహిస్తే డీఆర్‌ఏ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– మనోహర్‌, డీఎంహెచ్‌ఓ

భువనగిరి: జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా వరకు అర్హత లేకున్నా వైద్య సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దాడులు చేసి అర్హత లేని వారిని గుర్తించారు. ఈ నెల 5న యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండల పరిధిలో పలు ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించి సీజ్‌ చేశారు. కానీ సీజ్‌ చేసిన రెండు, మూడు నెలలకే ఆస్పత్రులకు చెందిన యాజమాన్యాలు తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిపై వైద్యశాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..

జిల్లాలో సుమారు 160 వరకు అనుమతి పొందిన ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రి ఏర్పాటు చేసుకునేందుకు ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారు అర్హులుగా ఉంటారు. వీరి పేరుమీదనే రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనుమతి పొందాలి. వారే వైద్య సేవలందించాలి. థియేటర్‌ అసిస్టెంట్‌ కోర్సు చేసిన వారే ఆపరేషన్‌ థియేటర్‌లో పనిచేయాలి. అనుమతి పొందిన సంఖ్య మేరకు పడకలను ఏర్పాటు చేసుకోవాలి. ఎంఎల్‌టీ కోర్సు పూర్తిచేసిన వారినే ల్యాబ్‌లో నియమించుకోవాలి. అర్హత గల పారామెడికల్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు కాకుండా మరొకరు వైద్య సేవలందిస్తున్నారు. అర్హత గల పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ అసిస్టెంట్లను నియమించుకోవడం లేదు. ఏ ఆస్పత్రి ఎదుట సర్వీస్‌ చార్జీల పట్టికను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తుర్కపల్లి, మాదాపూర్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అర్హత లేని వారు వైద్య చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా బొమ్మలరామారం, మోత్కూర్‌, తుర్కపల్లి, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో అర్హత లేని వారు సైతం ప్రసవాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇదే మాదిరిగా జిల్లాలో చాలా వరకు ఇలాంటి పరిస్థితి నెలకొంది. కేవలం దాడులు మాత్రమే కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ రిజిస్ట్రేషన్‌ ఒకరి పేరు మీద..

వైద్యం చేసేది మరొకరు

ఫ ఆస్పత్రులను గుర్తించి

సీజ్‌ చేసిన వైద్యశాఖ అధికారులు

ఫ మూడు నెలలు తిరగకుండానే

తిరిగి యథావిధిగా

కొనసాగిస్తున్న యాజమాన్యాలు

ఫ శాశ్వత చర్యలు తీసుకోవాలని

కోరుతున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement