నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం | - | Sakshi
Sakshi News home page

నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం

Mar 7 2025 8:54 AM | Updated on Mar 7 2025 8:54 AM

నృసిం

నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం

యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకున్నాయి. గురువారం ఉదయం భూదాన్‌పోచంపల్లికి చెందిన శ్రీపుండరీక భక్త సేవా సమాజం, యాదగిరిగుట్టకు చెందిన శ్రీభాగ్యలక్ష్మీ మహిళ భజన మండలిచే భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మంగళ వాయిద్యం, ఆస్థాన వైధిక ప్రార్థన చేపట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఏకే శ్రీనివాసాచార్యులు భగవత్‌ భక్తులు, వారిని భగవానుడు రక్షించిన విధానంపై ఉపన్యాసం చేశారు. ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన ముదపాక బాలసుందరం భగవతార్‌చే విరాటపర్వం అనే హరికథా గానం చేశారు. మధ్యాహ్నాం హైదరాబాద్‌లోని స్మరణ డ్యాన్స్‌ అకాడమీ బృందంచే నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహతి ఆర్ట్స్‌, వింజమూరి లక్ష్మీ బృందం, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ బృందంచే భక్తి సంగీతం నిర్వహించారు. సాయంత్రం సుముఖి నృత్యాలయం వరలక్ష్మీ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కొనసాగింది. తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సాయంత్రం అన్నమాచార్య సంకీర్తన విభావరి నిర్వహించారు.

నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం1
1/1

నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement