భువనగిరి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతమైన వాతావరణలో ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం తెలుగు, ఊర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,613 మంది విద్యార్థులకు గాను 6,289 మంది హాజరయ్యారు. 324 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. కాగా ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. నిర్దేశిత సమయానికి అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి ఐదు నిమిషాలు అలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతిచ్చారు. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఊరట కలిగింది. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు.
ఫ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు