కాంగ్రెస్‌ సభను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సభను విజయవంతం చేయాలి

Apr 20 2024 1:35 AM | Updated on Apr 20 2024 1:35 AM

సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌ - Sakshi

సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌ : ఈ నెల 21న హుజూర్‌నగర్‌లోని రాజీవ్‌ ప్రాంగణంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభకు నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభ సవ్యంగా జరిగేలా చూడాలని స్థానిక నేతలకు సూచించారు. నల్లగొండ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు ఆదర్శ వివాహం చేసుకున్న హుజూర్‌ నగర్‌ పట్టణానికి చెందిన ఎడ్ల విజయ్‌–శిరీష దంపతులను మంత్రి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, సుంకరి శివరాం యాదవ్‌, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, మంజూనాయక్‌, మజీద్‌ పాల్గొన్నారు.

ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement