సాగునీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

సాగునీరు విడుదల

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

సాగునీరు విడుదల ఎమ్మెల్సీ వంకకు మాతృవియోగం పుస్తక పఠనంతో జ్ఞానం 8న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ జేఈఈ మెయిన్స్‌కి 1,167 మంది హాజరు

దెందులూరు: ‘కొవ్వలిలో సాగుకు నీటి గండం’ శీర్షిక న ‘సాక్షి’లో గత బుధవా రం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. దా దాపు 350 ఎకరాలు వరి పొలాలు పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవడంతో ఈనిపొట్ట దశలో ఉన్న పొలాల భూ ములు బీటలు వారాయి. సాగు చేసే రైతులు కన్నీట పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి కాలువ ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుబ్రమణ్యం పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గోదావరి కాలువ నుంచి కొవ్వలిలో సాగు భూములకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.

తణుకు అర్బన్‌: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్‌ నాయకురా లు, సీపీఐ మాజీ ఎమ్మె ల్యే వంక సత్యనారాయ ణ సతీమణి, ప్రస్తుత ఎ మ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాతృమూర్తి వంక నాగమణి (95) తణుకులోని ఆమె స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త వంక సత్యనారాయణ గతంలోనే మృతి చెందారు. కుమారులు రామదాస్‌, మోహన్‌, రవీంద్రనాథ్‌, కుమార్తెలు అరుణ, సీతామహాలక్ష్మి ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పుస్తక పఠనం ద్వా రా జ్ఞానం వస్తుందని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రకృతి క్షేత్రపాలకులు మధుసూదనరావు కలెక్టర్‌ను కలిసి ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవా లి?, గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య– పర్యా వరణం/పరిశుభ్రత అనే రెండు పుస్తకాలను సుమారు 300 ప్రతులను డీఈఓకు అందజేశారు. వీటిని హైస్కూల్‌ విద్యార్థులకు అందించాలని కోరారు. డాక్టర్‌ మీసరగండ రమాదేవి రచించిన ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవాలి? పుస్తకం యుక్త వయసు బాలికలకు అవసరమైన వ్యక్తిగత అవగాహన పెంచేందుకు దో హదపడుతుందన్నారు. కోడూరి శ్రీరామమూర్తి రచించిన గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య – పర్యావరణం/ పరిశుభ్రత పుస్తకం ద్వారా పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించవచ్చని చెప్పారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ (ఎన్‌సీఎస్‌) ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 8న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, జగదీశ్‌ మైరెన్‌ ఎక్స్‌పోర్ట్స్‌, కియా మో టార్స్‌, జెస్పర్‌ మోటర్స్‌, ఇన్నోవా సోర్స్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్‌ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ 9440838388, 8688594244 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలకు ఆదివారం 1,167 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో ఉదయం 127 మందికి 119, మ ధ్యాహ్నం 121 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 181 మందికి 175 మంది, మధ్యాహ్నం 179 మందికి 172 మంది హా జరయ్యారు. శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉ దయం 116 మందికి 111 మంది, మ ధ్యాహ్నం 105 మందికి 102 మంది హాజర య్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 99 మందికి 98 మంది, మ ధ్యాహ్నం 100 మందికి 95 మంది హాజరయ్యారు. డీఎన్‌ఆర్‌ కళాశాలలో ఉదయం 98 మందికి 95 మంది, మధ్యాహ్నం 93 మందికి 89 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement