జంగారెడ్డిగూడెం: సెల్‌ఫోన్ చోరీ జరిగినా, పోగొట్టుకున్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు. పట్టణంలో ఆదివారం 5వ విడత కార్యక్రమంలో భాగంగా రికవరీ అయిన సెల్‌ఫోన్లను ఏఎస్పీ సుస్మిత , సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌లతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి సీఐఆర్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. సెల్‌ఫోన్ ట్రేస్ కాగానే బాధితులకు అందిస్తామన్నారు. సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్ వినియోగించే సమయంలో పోలీస్ శాఖ నుంచి మెసేజ్‌లు, పోలీస్ సిబ్బంది ఫోన్ చేసి చోరీ సెల్‌ఫోన్ వివరాలు తెలియజేస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటివరకు సీఐఆర్‌లో 393 రిక్వెస్ట్‌లు నమోదయ్యాయని ఏఎస్పీ చెప్పారు. కాగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో చోరీ సెల్‌ఫోన్‌ల రికవరీ 90 శాతం ఉందని ఏఎస్పీ అన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


