● టీడీపీ అల్లర మూకల పనే
● ఇద్దరిపై కేసు నమోదు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలోని అంబేడ్కర్ పార్కు వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శిలా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సిలువూరి హరివర్మ చేసిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన సాదే టోనీ, కప్పల చందు అనే యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి ఆదివారం తెలిపారు. ఈ ఇద్దరు యువకులతో పాటు మరో 18 మంది అర్ధరాత్రి పార్కులో పార్టీ చేసుకొని ఈ విగ్రహ విధ్వంసానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పూర్తిస్థాయిలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


