భీమవరం (ప్రకాశంచౌక్): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, కులరహిత సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్జీవన్ చిత్రపటం వద్ద కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యారంగ అభివృద్ధికి కృషి విశేషమని పేర్కొన్నారు. అనంతరం జగ్జీవన్ జీవిత విశేషాలపై ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన జీవితంపై రూపొందించిన వీడియోను ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్‌వీ అరుణకుమారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బాబు, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పెద్దిరాజు, ఆశాజ్యోతి, రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
స్ఫూర్తిప్రదాత జగ్జీవన్‌రామ్ : ఎస్పీ అస్మి
అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన సామాజిక విప్లవకారుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తిప్రదాత అని జిల్లా ఎస్పీ అద్నాన్ న యీం అస్మి అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, మహిళా ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) ఈ.ఇందుమతి, ఆర్‌ఎస్సై కె.గోపి కృష్ణ పాల్గొన్నారు.


