భీమవరం (ప్రకాశంచౌక్): పీ–ఫోర్ కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం భీమవరం త్యాగరాజ్ భవన్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్‌్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పీ–ఫోర్ కార్యక్రమం రాష్ట్ర సామాజిక ముఖచిత్రాన్ని మార్చే చర్యగా అభివర్ణించారు. జిల్లాలో 49,118 బంగారు కుటుంబాలు గుర్తించగా, వాటిలో 22,762 కుటుంబాలను 2,331 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


