ఆందోళనలో మొక్కజొన్న రైతులు | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలో మొక్కజొన్న రైతులు

Mar 30 2026 7:17 AM | Updated on Mar 30 2026 7:17 AM

ఆందోళనలో మొక్కజొన్న రైతులు నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు 1,047 మందికి ఉచిత ప్రవేశాలు నేడు సామూహిక గృహ ప్రవేశాలు

దెందులూరు: రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్నను పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. కష్టనష్టాలు, విపత్తులను తట్టుకుని మొక్కజొన్నను పండిస్తే మద్దతు ధర అందక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచే యక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధర తగ్గించి దోచుకుంటున్నారన్నారు. ఏలూరు జి ల్లాతో పాటు విజయనగరం, ఎన్టీఆర్‌, బాపట్ల, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాల్లో రై తులు కొనుగోలు కేంద్రాల కోసం పలు రూ పాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని, క్వింటాకు రూ.2,400 ధర చెల్లించాలని కోరారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రతి వారం కలెక్టరేట్‌, గ్రామ, డివిజినల్‌ కేంద్రాల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యాక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు. అలాగే జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవనంలో సో మవారం మధ్యాహ్నం 2 గంటలకు పీ4 ప్ర థమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. క్యాంపు కా ర్యా లయం నుంచి అధికారులతో సమీక్షించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): విద్యాహక్కు చట్టం కింద 2026–27కు సంబంధించి ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు జిల్లాలో 1,047 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ పి.శ్యామ్‌సుందర్‌ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌ను ఏప్రిల్‌ 7లోపు కేటాయించిన పాఠశా లలో సమర్పించి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తికాకుంటే సీటు రద్దు చేస్తారన్నారు. ఎంఈఓలు తమ పరిధిలో జరిగిన ప్రవేశాల వివరాలను ధ్రువీకరించి, పూర్తి నివేదికను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు జిల్లాలో సోమ వారం 1,160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో 123, దెందులూరులో 89, ఏలూరు లో 502, గోపాలపురంలో 12, కై కలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరులో 52 ఇళ్లు పూర్తయ్యాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement