30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

Mar 30 2026 7:17 AM | Updated on Mar 30 2026 7:17 AM

30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలని జాక్టో చైర్మన్‌ పువ్వుల ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఆశోకవర్థన ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) జి ల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. జా క్టో జిల్లా చైర్మన్‌గా పువ్వుల ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌గా తలపంటి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్‌గా భూక్యా రాము, కోశాధికారిగా ఎన్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. వీరితో పాటు అదనపు సెక్రటరీ జనరల్‌గా కేఎస్‌వీకే రాజ్‌కుమార్‌, కో చైర్మన్లుగా కాటి వెంకటరమణ, బి.విద్యాసాగర్‌, పేరాబత్తుల సురేష్‌, మహిళా కో–చైర్మన్‌గా నందిగం శర్వాణి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా టీఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి, తోట ఎడ్వర్డ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్‌ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైనా జాక్టో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. పీఆర్‌టీయూ, ఆపస్‌, ఎన్‌టీఏ, బీటీఏ (అమరావతి), టీఎన్‌యూఎస్‌, డీపీఆర్‌టీయూ, ఎంటీఎఫ్‌, ఏపీఎస్‌టీఏ, ఎంటీఎస్‌, ఏపీటీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement