పట్టిసం శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం రేవులో క్షేత్రానికి వెళ్ళేందుకు వీలుగా క్యూలైన్‌లు, టిక్కెట్ కౌంటర్‌లు, ర్యాంపు పనులు సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కొంత దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి పంట్ల మీద, తడికల బాదులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ఇసుక తిన్నెలపై చేరేలా పనులు చేపట్టారు. ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ మరో వైపు నదిలో ఏర్పాటుచేసిన ప్లాట్‌ఫాం దాటాల్సి ఉంది. అక్కడి నుంచి క్షేత్రానికి నడచుకుంటూ వెళ్ళేందుకు వీలుగా గోనె సంచుల్లో ఇసుక నింపి బస్తాలతో ప్లాట్‌ఫాం పనులు చేపట్టాల్సి ఉంది. క్షేత్రానికి దిగువ నుంచి క్యూలైన్‌లో నడుచుకుని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చేలా పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టిసం పంచాయతీ దేవస్థానం అధికారులు ఇరువైపులా పనులు చేపట్టారు.
టిక్కెట్ కౌంటర్‌లు, క్యూలైన్‌ల కోసం చలువ పందిళ్ళు
గోదావరి వైపు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు
పట్టిసం శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు


