చిత్తం.. సారూ !
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: అపార్ట్‌మెంట్‌కు అఫ్రూవల్ కావాలా? లే అవుట్ వేస్తున్నారా? అప్రూవల్ కోసం ఎమ్మెల్యే ని కలిసి నాకు ఒక్కమాట చెప్పించమంటారో అధికారి. అన్ని పేపర్లూ సవ్యంగానే ఉన్నాయి.. అదెంత పనండి చేసేద్దాం.. చిన్నసారును కలిసి ఒక కాల్ చేయించమంటారు మరొకరు.. ఎక్కడ చూసినా ఇదే తంతు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాల్సిన అధికారులు పాలకపక్షం నే తల సేవలో తరిస్తున్నారు. వారి చెప్పినట్టు పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
90 శాతానికి పైగా స్థానాల్లో..
జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉన్నాయి. 20 మంది జెడ్పీటీసీ సభ్యులు, 20 మంది ఎంపీపీలు, 390 మంది సర్పంచులు, 352 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. గత స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా 90 శాతానికి పైగా స్థానాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులు, సానుభూతిపరులే విజయం సాధించారు. ఏడాదిన్నర కాలంగా కూటమి నేతలు కాంట్రాక్టు వర్కులు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగ అవకాశాలు, రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, నగదు తదితర ప్రలోభాల ఎర, ఒత్తిళ్లతో తమవైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. కాగా ఎన్ని ప్రలో భాలకు గురిచేసినా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ మెజార్టీ సభ్యులు సొంతగూటిని వీడలేదు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల కోసం కొద్దినెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో త మ అభ్యర్థికి మద్దతు తెలపాలని లక్షలు ఆఫర్ చేసి నా లెక్కచేయకుండా నిజాయితీగా నిలబడిన వారు ఎందరో ఉన్నారు.
వేధింపులపర్వం.. అడ్డగోలు వ్యవహారం
ఎంక్వయిరీలు, అక్రమ కేసులు, వారు ప్రతిపాదించిన పనులు చేయకుండా, పెండింగ్ బిల్లులు వి డుదల చేయకుండా వేధింపులకు గురిచేయడం.. తది తర రూపాల్లో వైఎస్సార్‌సీపీ విపక్ష సభ్యుల్ని తమ పార్టీల్లోకి లాక్కునేందుకు జిల్లాలోని అధికారపక్షం విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. అధికారులను అడ్డం పెట్టుకుని వారిపై సామదాన దండోపాయాలను ప్రయోగిస్తుండగా, అందుకు అధిక శాతం మంది అధికారులు వంత పాడుతుండటం గమనార్హం. నిబంధనల మేరకు పనిచేయాల్సింది పోయి అధిక శాతం మంది పాలకపక్షం నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరం ఉన్నా సమావేశం నిర్వహించకపోవడం, కో రం సరిపోకపోయినా ముఖ్య అతిథి వచ్చారని స మావేశం జరపడం మాదిరి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల పంచాయతీ బోర్డు సమావేశా లు జరుపకుండా వాయిదాలు వేస్తున్నటువంటి ఘ టనలు చోటుచేసుకుంటున్నాయి. పనులు చేయాలంటే ముందుగా ఎమ్మెల్యేను వెళ్లి కలవమని కొందరు అధికారులు చెబుతున్నట్టు ప్రజాప్రతినిధులు అంటున్నారు. ‘ఎమ్మెల్యేనే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు, ఆయన చెప్పినట్టుగా పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది’ అంటూ నిస్సిగ్గుగా స్వామిభక్తి చూపించుకుంటున్నారని మండిపడుతున్నారు. వివిధ అనుమతుల మంజూరు విషయమై తమను కలుస్తున్న రియల్టర్లు, వ్యాపారులకు సైతం లోపాయికారీగా ఇదే సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా ఉన్నా కూటమి నేతలు సిఫార్సులు చేసిన వారికి మాత్రమే అధికారులు పనులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యా దులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు మేరకు కోరంకు సరిపడా సభ్యులు ఉంటేనే సమావేశాలు నిర్వహించాలి. అందుకు భిన్నంగా ఒక్క ఎంపీటీసీ సభ్యునితోనే మండల సమావేశాన్ని నడిపించేశారు మరో ఎంపీడీఓ. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు కాలాతీతం కాకూడని భావించి నిబంధనలకు నీళ్లొదిలేశారు. విషయం బయటకు పొక్కడంతో కోరం సరిపోయినట్టుగా చూపించుకునేందుకు మినిట్స్ బుక్‌ను ఎంపీటీసీ సభ్యుల ఇళ్లకు పంపి వారి సంతకాలు సేకరించే పనిలో పడ్డారంట.
ప్రజాస్వామ్యం అపహాస్యం
కూటమి నేతల అడుగులకు మడుగులు
నిబంధనలను పాటించని అధికారులు
విపక్ష సభ్యుల్ని అధికార పక్షం వైపు తిప్పేందుకు ప్రయత్నాలు
పనులు జరగాలంటే ఎమ్మెల్యేని కలవాలంటూ సూచన
ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులు
పనుల కోసం తీర్మానాలు కావాలన్నా.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నా ముందు మీరెళ్లి ఎమ్మెల్యేని కలవండంటూ ఎంపీటీసీ సభ్యులకు బాహాటంగానే చెబుతున్నారంట ఒక ఎంపీడీఓ. ఇటీవల మండల సమావేశానికి ముందు ఇదే విషయాన్ని పాలకవర్గానికి స్పష్టం చేసి వెళ్లిపోయారు. ఫోన్ చేస్తే అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానంటూ చెప్పుకొచ్చారంట. తీరా మధ్యాహ్నం నుంచి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో హుషారుగా అందరితో మాట్లాడుతూ కనిపించారంట. సరిపడా సభ్యులున్నా కోరం లేదని సమావేశం వాయిదా వేసినట్టు తెలిసి పాలకవర్గం సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే
చెబితేనే పంచాయతీ బోర్డు
మీటింగ్ పెడతానంటూ ఒక కార్యదర్శి
ఐదు నెలలుగా సమావేశాలు నిర్వహించ లేదంట. పంచాయతీ తీర్మానాలు లేకుండా, అనుమతులు రాకుండానే పనులు చేస్తుండటం, ఎమ్మెల్యే చెప్పినట్టుగా చేస్తూ రాజ్యాంగం తనకు కల్పించిన అధికారాలను అడ్డుకుంటున్నారని ఓ సర్పంచ్ ఇటీవల అధికారులకు ఫిర్యాదు
చేశారు.
చిత్తం.. సారూ !


