హేలాపురి కల్పవల్లి
ఏలూరు నగర ఇలవేల్పు.. హేలాపురి ఆరాధ్య దేవత గంగానమ్మవారి జాతర మహోత్సవం వచ్చేసింది. మూడు నెలలుగా నగరంలోని ఏడు ప్రాంతాల్లో అమ్మవార్ల మేడల వద్ద చేస్తున్న కొలుపులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆదివారం నగరంలోని మూడొంతుల ప్రాంతాల్లో జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడేళ్లకోసారి వచ్చే జాతర కావడంతో నగరవాసులు మేడల వద్దకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలు, చీరలు, పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. అలాగే సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా, అపార్ట్‌మెంట్ వాసులు బృందాలుగా వెళ్లి సారెలు సమర్పించారు.
లక్ష్మీవారపుపేటలోని మేడలో..
ఏలూరు లక్ష్మీవారపుపేటలో అమ్మవారి ఉత్సవమూర్తి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతరను పురస్కరించు కుని ఏలూరు నగరమంతా కోలాహలంగా మారింది. నగరవాసులు తమ బంధువులు, మిత్రులను ఆహ్వానించారు. ఇప్పటికే నగరంలోని లాడ్జీల్లో గదులు నిండుకున్నాయి. శనివారం సాయంత్రం నుంచి అతిథులు రాక మొదలుకాగా.. ఆదివారం ఉదయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం వేకువజాము 4 గంటల నుంచి అమ్మవార్ల మేడల వద్ద భక్తుల సందడి మొదలుకానుంది.
మేడల వద్ద పూర్తయిన ఏర్పాట్లు
అమ్మవార్ల మేడల వద్దకు చేరుకునే భక్తుల కోసం జాతర కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. నైవేద్యాలు సమర్పించేందుకు ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. జాతర ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కమిటీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మేడల వద్ద వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయనుంది.
అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం
నగరమంతా జాతర సందడి నెలకొంది. ప్రతి ఇంటి వద్ద అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, టిప్‌టాప్ పందిళ్లు ఏర్పాటుచేశారు. నగరంలోని టిప్‌టాప్ సామగ్రికి డిమాండ్ రావడంతో పొరుగు గ్రామాల నుంచి తెప్పించారు. అలాగే వంట పాత్రలను శుక్రవారం సాయంత్రం నుంచి దింపుకుంటున్నారు. జాతరను పురస్కరించుకుని బంధు, మిత్రులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరంతర నిఘా: అమ్మవార్ల మేడల వద్దకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్ర త్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వారిని నియంత్రించడానికి మఫ్టీలో పోలీసులను పహారా కోసం ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నారు.
అమ్మవారికి నైవేద్యం తీసుకువెళుతూ..
తూర్పువీధి మేడలో కొలువైన అమ్మవారు
ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు
మది నిండుగా.. ఊరంతా పండుగ
నేడు గంగానమ్మ జాతర
నగరమంతా కోలాహలం
అమ్మవార్ల మేడల వద్ద సర్వం సిద్ధం
ఇళ్ల వద్ద సందడే సందడి
హేలాపురి కల్పవల్లి
హేలాపురి కల్పవల్లి
హేలాపురి కల్పవల్లి
హేలాపురి కల్పవల్లి
హేలాపురి కల్పవల్లి


