జాతరలో డ్రోన్ నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు తూర్పువీధిలో గంగానమ్మ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రేంజ్ ఐజీ జీ వీజీ అశోక్‌కుమార్ ఆదేశించారు. ఏలూరు వన్‌టౌన్ తూర్పువీధి, దక్షిణపువీధి జాతర ప్రాంతాలను ఎస్పీ కేపీ శివకిషోర్‌తో కలిసి ఆయన శనివారం ఆయన పోలీస్ బందోబస్తు చర్యలపై ఆరా తీశారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. జాతర కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పా ట్లు చేయాలన్నారు. జాతర ఊరేగింపులో మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించాలనీ, డ్రోన్ కెమెరా లు, సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఉంచాలని ఆదేశించారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఎస్సై సుధాకర్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు ఉన్నారు.
భీమవరం: పట్టణంలో శనివారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 100 మందికి ఐదుగురు, డీఎన్నార్ డిగ్రీ కళాశాలలో 199 మందికి ఇద్దరు గైర్హాజరయ్యారు. అలాగే తొలి సెషన్‌లో తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశా లలో 151 మందికి 149 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 117 మందికి 117 మంది, మధ్యాహ్నం సెషన్‌లో తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్‌లో 152 మందికి 152 మంది, శశి ఇంజనీరింగ్‌లో 120 మందికి 120 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.


