బస్సు ఢీకొనడంతో వృద్ధుడు మృతి
బస్సు ఎక్కుతూ కాలు జారడంతో ప్రమాదం
పాలకొల్లు సెంట్రల్: ఉచిత బస్సు ప్రయాణం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం పాలకొల్లు పొట్టి శ్రీరాములు బస్టాండ్‌లో ఓ వృద్ధుడు తన కుమార్తె ఇంటికి వెళ్లడానికి బస్సు ఎక్కుతూ కాలు జారడంతో అదే బస్సు కింద పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోడూరు మండలంలోని వేడంగికి చెందిన బుడితి పురుషోత్తం (70) పెద్ద కుమార్తె ఉంటున్న ఉండికి వెళ్లడానికి పాలకొల్లు బస్టాండ్‌కు వచ్చారు. నరసాపురం నుంచి ఏలూరు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలు జారి బస్సు కింద పడడంతో మర్మాంగాలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి కోడలు రాహెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై పృథ్వి తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సు వద్ద రద్దీ, తోపులాట
పాలకొల్లు బస్టాండ్‌లోకి బస్సు సుమారు మధ్యాహ్నం 3.15 గంటలకు పాయింట్‌లోకి వచ్చింది. ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ, తోపులాట చోటుచేసుకుంది. డ్రైవర్ బస్సు ఎక్కి సీట్లో కూర్చుని ఉండగా ఎవరో పడిపోయినట్టు అనిపించి కిందకు దిగి వచ్చారు. జనం ఎక్కేస్తుండగా కింద ఎవరో పడిపోయారని, అలా చూ సుకోకుండా ఎక్కేస్తే ఎలా అంటూ డ్రైవర్ ప్ర శ్నించినట్టు స్థానికులు చెబుతున్నారు. బస్సు కింద పడ్డారా? జనం తొక్కిసలాటలో మృతి చెందాడా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తొడ భాగంలో ప్యాంట్ చిరిగిపోయి ఉండడంతో తొక్కిసలాటలో ప్యాంటు ఎలా చిరుగుతుందని, టైరు ఎక్కి ఉంటే ప్యాంటు చిరిగే అవకాశం ఉంటుందని స్థా నికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బస్సు ఢీకొనడంతో వృద్ధుడు మృతి


