పీహెచ్‌డీ కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన శాస్త్రంలోని ఏడు విభాగాల్లో పరిశోధన డిగ్రీ కోర్సు ప్రవేశానికి గురువారం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాలలో కౌన్సెలింగ్ జరిగింది. ఐసీఏఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా , రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి 27 సీట్లకు గాను 20 మంది ప్రవేశాలు పొందారు. మిగిలిన ఏడు సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. విద్యార్థులను అభినందిస్తూ వీసీ మాట్లాడారు. రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి బి.ప్రసన్నకుమార్, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ఎం.మాధవి, ఎస్సీ ఎస్టీ సెల్ ఆఫీసర్ ఇన్‌చార్జి డి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సీనియర్ నెట్‌బాల్ పోటీలకు 21వ తేదీన భీమవరంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్‌బాల్ సంఘ కార్యదర్శి ఎన్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పురుషులు, మహిళల జట్ల ఎంపిక ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం పట్టణంలోని బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో జరుగుతాయన్నారు. వివరాలకు సెల్: 94939 95839, 98858 86722 నంబర్లలో సంప్రందించాలని విజయలక్ష్మి కోరారు.


