కదం తొక్కిన సంతకం
పేదలకు వైద్య విద్యను, ఆధునాతన వైద్యాన్ని చేరువ చేసేలా గత వైఎస్సార్‌సీపీ సర్కారు దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వీటిని ప్రైవేటీకరించేందుకు పూనుకుంది. దీనిపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహోద్యమంలా సాగింది. ‘నిరసన సంతకం’ పోటెత్తింది. జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల సంపూర్ణ మద్దతు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను భారీ ర్యాలీగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు.
సాక్షి, భీమవరం/కాళ్ల : వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రం భీమవరంలో జనం కదం తొక్కారు. ప్రజా ఆకాంక్షను నెరవేర్చా లని, ప్రభుత్వమే నడపాలన్న నినాదాలతో హో రెత్తించారు. ప్రజలు సంతకాలు చేసిన ప్రతులతో భారీ ర్యాలీ చేశారు. జిల్లావ్యాప్తంగా వేలాదిగా వ చ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, యువతతో పెద అమిరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి జువ్వలపాలెం రోడ్డు, ప్రకాశ్‌నగర్ వరకు కిలోమీటర్లు పొడవునా రోడ్డు మోటారు సైకిళ్లు, కార్లతో నిండిపోయింది.
4.50 లక్షల సంతకాల సేకరణ
తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం, పాలకొల్లు, ఉండి సమన్వయకర్తలు చిన మిల్లి వెంకటరాయుడు, గుడాల శ్రీహరిగోపాలరా వు, పీవీఎల్ నరసింహరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లాలో అనూహ్య స్పందన వచ్చిందని ప్రసాదరాజు తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా 4.50 లక్షల మంది సంతకాలను సేకరించామన్నారు. అత్యధికంగా తణుకులో 80 వేలకు పైగా సంతకాలు సేకరించగా ఆచంటలో 72లకు పైగా, మిగిలిన నియోజకవర్గాల్లో 55 వేలకు పైగా సంతకాలు సేకరించామన్నారు. వాటిన్నంటినీ ప్రత్యేక వాహనంలో భద్రపరిచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలను ఈనెల 18న పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు అందజేస్తారన్నారు. లక్ష్యానికి మించి జిల్లాలో సంతకాల సేకరణ ప్రజాఉద్యమాన్ని విజయవంతం చేయడంపై నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కేడర్, ప్రజలకు ప్రసాద రాజు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో లక్షలాది మంది..
వైద్య కళాశాలలను ప్రైవేటీరణ చేయాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని నిరసిస్తూ పేదల పక్షాన వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం చివరి దశకు చేరింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని జిల్లాలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈనెల 10న నియోజకవర్గాల్లో ర్యాలీలు అనంతరం సంతకాల ప్రతులను పెదఅమిరంలోని జిల్లా కార్యాలయానికి తరలించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా సాగింది. ఈ ఉద్యమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
గర్జించిన జన‘కోటి’
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపాటు
వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, యువత
సంతకాల ప్రతులతో భీమవరంలో భారీ ర్యాలీ
జిల్లాలో 4.50 లక్షల సంతకాలుసేకరించామన్న జిల్లా అధ్యక్షుడు ముదునూరి పసాదరాజు
సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి తరలింపు
కదం తొక్కిన సంతకం
కదం తొక్కిన సంతకం


