విద్యుత్ ఆదా తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ ఆదా తప్పనిసరి అని కలెక్టర్ సీహెచ్ నా గరాణి అన్నారు. ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని ప్రకాశం చౌక్ వద్ద ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం మీదుగా తిరిగి ప్రకాశం చౌక్‌కు చేరుకుంది. ఇంధన పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఈనెల 20 వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈలు మధుకుమార్, నరసింహమూర్తి, విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అమరజీవికి ఘన నివాళి
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కలెక్టర్ నాగరాణి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో అమరజీవి చిత్రపటం వద్ద ని వాళులర్పించారు. అలాగే కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


