పీజీఆర్‌ఎస్‌లో 197 అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అర్జీలు పోటెత్తా యి. జిల్లా నలుమూలల నుంచి 197 మంది ఫి ర్యాదులు అందించారు. అర్జీలను నిశితంగా పరిశీ లించి గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, సమర్థతను పెంచడమే లక్ష్యమన్నారు. కింది స్థాయి అధికారులు పనితీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్‌తో కలిసి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, కలెక్టరేట్ ఏఓ ఎన్.వెంకటేశ్వర్లు ఫిర్యాదులు స్వీకరించారు.
క్లస్టర్ విధానాన్ని విరమించాలి
స్కూల్ కాంప్లెక్స్‌లోని ఏ,బీ క్లస్టర్ విధానాన్ని విరమించాలని, 2106లో పీఏబీ ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నా పెరిగిన ధరలకు అనుగుణంగా సీఆర్‌ఎంపీల అర్హతలకు ఆధారంగా వేతనాలు పెంచాలని ఏపీసీఆర్‌ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమ వారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వారి సమస్యలపై కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ సీఆర్‌ఎంటీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
యానిమేటర్ల అవినీతిపై గళం
ఆకివీడు పంచాయతీ పరిధిలోని సంత మార్కెట్, సమతా నగర్ డ్వాక్రా యానిమేటర్లు సుమారు రూ.2 కోట్లు వరకు అవినీతి చేశారని వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సరైన చదువు లేని యానిమేటర్ చెప్పిన మాటలు నమ్మి మహిళలు మోసపోయారని, ఈ విషయం మెప్మా అధికారులకు తెలిసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
డ్వాక్రా సంఘాల మహిళల నిరసన
నినాదాలు చేస్తున్న ఏపీసీఆర్‌ఎం టీచర్లు
పీజీఆర్‌ఎస్‌లో 197 అర్జీల స్వీకరణ
పీజీఆర్‌ఎస్‌లో 197 అర్జీల స్వీకరణ


