సబ్‌జైలు తనిఖీ
నరసాపురం: తగాదాలకు, నేరాలకు పాల్పడే ముందు భవిష్యత్ పరిణామాలు ఆలోచించుకోవాలని నరసాపురం బూనియర్ సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి సూచించారు. నరసాపురం సబ్ జైలును జడ్జి శనివారం ఆకిస్మకంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, జైలు పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ నేరాలు చేసి జైలు పాలైతే, కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. బంధువుల ముందు చులకన అవుతారని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని వారికి మండల న్యాయసేవాధికారసంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్జి వెంట సబ్‌జైలు సూపరిం్డంట్ టి.అప్పారావు, ప్యానల్ యన్యావాది విరీష, పీఎల్‌బీవీ శ్యామ్ కుమార్ ఉన్నారు.
ఏలూరు (టూటౌన్): డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీల సమగ్ర కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆర్నేపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక తంగెళ్ళమూడి శివగోపాలపురంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో బీసీ నాయకులు కిమిడి రేణు కేశవరావు, తాడిశెట్టి దుర్గారావు, ఆండ్రంచి మాణిక్యం పాల్గొన్నారు.
సబ్‌జైలు తనిఖీ


