ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై నిర్వహిస్తున్న విస్తృత స్థాయిలో తనిఖీల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 72 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. ఏలూరు జిల్లాలో కలపర్రు టోల్గేట్, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీఓలు ఎస్‌బీ శేఖర్, ఎస్‌ఎస్ రంగనాయకులు పర్యవేక్షణలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారుల ప్రత్యేక బృందాలు ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై గత సోమవారం నుంచి శుక్రవారం రాత్రి వరకు 72 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయా నిబంధనల అతిక్రమణలకు గానూ నమోదు చేసిన ఈ కేసుల్లో రూ.7,65,230 అపరాధరుసుం విధించగా, రూ.4,50,100 ఇప్పటి వరకు వసూలైనట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు చూపని, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్యాసింజర్ లిస్టు లేని తదితర ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామన్నారు.
పెదపాడు: డివైడర్ పక్కనే నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పెదపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళ్లమూడి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వల్లి కృష్ణమూర్తి(40) విజయరాయి గ్రామానికి కూలి పనుల నిమిత్తం జట్టుతో కలిసి వచ్చి, వారి నుంచి విడిపోయి విడిగా కూలి పను లు చేసుకుంటున్నాడు. అయితే అతడు డివైడర్ పక్కనే నిద్రిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. బంధువులు ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


