యోగాసన పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్టు
నూజివీడు: విశాఖపట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల్లో జిల్లాలోని నూజివీడు, ఆగిరిపల్లి, శోభనాపురం, వడ్లమాను తదితర గ్రామాలకు చెందిన యోగ సాధకులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. 38వ యోగాసనా చాంపియన్‌షిప్ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యండూరు నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు, కోశాధికారి ఏపీవీ బ్రహ్మచారి, యోగ గురువులు టీవీకె కుమార్ నేతృత్వంలో 35 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. ఈనెల 25, 26 తేదీలలో జరిగిన ఈ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ నుంచి పది డివిజన్లో పోటీపడగా ఏడింటిలో విజయం సాధించారు. మహిళల విభాగంలో బొద్దూరు పద్మశ్రీలత 3వ స్థానం సాధించగా, పురుషుల విభాగంలో మూడో స్థానంలో నూజివీడుకు చెందిన పత్రి కనకభూషణం, 5వ స్థానంలో టి.సాయి ప్రసన్నలక్ష్మి, 7వ స్థానంలో కే శ్రీనివాసరావు, 8వ స్థానంలో ఎం జ్యోతి కుమారి, 9వ స్థానంలో యండూరు నరసింహమూర్తి, 10వ స్థానంలో భావన, జూనియర్స్‌లో ఆరో స్థానంలో ఎల్ అను నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ యోగ అసోసియేషన్ అధ్యక్షుడు కోన కృష్ణదేవరాయలు. ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్‌లచే షీల్డ్స్, మెడల్స్ అందజేశారు.


