తుపాను రక్షణ చర్యలపై సమీక్ష
ఏలూరు టౌన్: జిల్లాలో మోంథా తుపాను రక్షణ చర్యలపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో ప్రత్యేక అధికారి ఆక్టోపస్ డీఐజీ ఎస్.సెంఽథిల్‌కుమార్ మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తుపాను ముందస్తు రక్షణ చర్యలపై ఆయన సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ముందస్తు సహాయక చర్యలపై ఎస్పీ వివరించారు. తుపాను కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని, పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఏలూరు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఈడీఆర్‌ఎఫ్) బృందాలు సన్నద్దం చేశామన్నారు.
ఆక్టోపస్ డీఐజీ సెంథిల్ కుమార్


