బెల్టుబారులు.. మద్యం ఏరులు
‘మద్యం’తర ముప్పు
కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. ఊరూరా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏనీటైమ్ మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు స్థానిక కూటమి నేతలతో కలిసి బడ్డీ దుకాణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వందలాది బెల్టుషాపులు ఏర్పాటుచేశారు. కావాల్సిన చోటుకు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో ఐదు నుంచి పది వరకు బెల్టుషాపులు ఉంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో బెల్టుషాపులు, నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
– సాక్షి భీమవరం
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు జాతీయ రహదారి నంబర్ 165కు చేర్చి కెనరా బ్యాంక్ సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్, బ్రాందీ షాపులు నడుపుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారికి చేర్చి పెట్రోల్ బంక్ పక్కనే మరో బ్రాందీ షాపును నడుపుతున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ సమీపంలో ఉన్న హైవేను ఆనుకుని మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. సమయంతో పనిలేకుండా నిత్యం మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా కై కలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో సుమారు 50 బెల్టుషాపులు నడుస్తున్నాయి. లంక గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండదండలు ఉన్నాయి.
కామవరపుకోటలో బెల్టు షాపు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ సమీపంలో ఓ వైపు కళాశాల, మరోవైపు ఆస్పత్రి ఉండగా మధ్యలో బార్ ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో దుర్గమ్మ ఆలయం కూడా ఉండటం గమనార్హం. రోడ్డును ఆనుకుని ఉన్న ఇదే బార్ వల్ల కళాశాల విద్యార్థులు, ఆసుపత్రికి, గుడికి వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో బెల్టుషాపు అమ్మకాలు జోరుగా నిర్వహిస్తున్నారు. బెల్టు షాపుల్లో అదనపు రుసుములు సైతం వసూలు చేస్తున్నారు. రాష్ట్రీయ రహదారికి ఆనుకుని యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా కామవరపుకోటలో పబ్లిక్‌గా బెల్టుషాపు నిర్వహిస్తూ ఎనీటైమ్ మద్యం విక్రయిస్తున్నారు.
బెల్టుబారులు.. మద్యం ఏరులు
బెల్టుబారులు.. మద్యం ఏరులు
బెల్టుబారులు.. మద్యం ఏరులు
బెల్టుబారులు.. మద్యం ఏరులు
బెల్టుబారులు.. మద్యం ఏరులు
బెల్టుబారులు.. మద్యం ఏరులు


