హాస్టల్ ప్రాంగణం పూడ్చివేత
ఆకివీడు: ఆకివీడు పెదపేటలోని బీసీ హాస్టల్ ప్రాంగణాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేస్తున్నా రు. హాస్టల్ ప్రాంగణం లోతట్టుగా ఉండటంతో వర్షానికి, డ్రెయినేజీలో నీరు ప్రాంగణంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ‘దుక్కి వర్షానికే హాస్ట ల్ ప్రాంగణం ముంపు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రాంగణాన్ని మట్టితో పూడ్చుతున్నారు.
లారీ ఢీకొని బాలుడు మృతి
ఆకివీడు: అమ్మా.. ప్రైవేటుకు వెళ్లివస్తానంటూ సైకిల్‌పై బ్యాగ్ తగిలించుకుని వెళ్లిన బా లుడు లారీ ఢీకొని దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం గుమ్ములూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మల్లా వీరన్న కుమారుడు మోనేష్ శ్రీసాయి (11) సైకిల్‌పై ప్రైవేటుకు వెళుతుండగా గ్రామంలోని ప్రధాన సెంటర్‌లో గణపవరం వైపు వెళుతున్న రొయ్యల లోడు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో శ్రీసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలు అక్కడకు చేరుకున్నారు. వీరన్నకు ఏకై క కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఆకివీడులోని ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఏఎస్సై స త్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ వేగంగా రావడంతో అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని కలెక్టరేట్, డివిజినల్, మండల స్థాయిలో సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ని రద్దు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. తుపాను కారణంగా రద్దు చేశామన్నారు.
భీమడోలు: భీమడోలులో భార్యాభర్తలు శనివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని కుటుంబ సభ్యులు గ్రామంలో ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఏలూరు ఆంధ్రా ఆస్పత్రికి, గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వీరు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. గ్రామానికి చెందిన కటారి మోహన్ అనే యువకుడు తన చేతిలో పలుసార్లు కుంకుమ పోసి అమ్మవారి కుంకు మని చెప్పి ఉచ్చు లోకి లాగి తనను మోసం చేశాడని, మాయమాటలు చెప్పి 15 రోజుల పా టు గ్రామాంతరం తీసుకుని వెళ్లాడని పూర్ణిమ పేర్కొంది. భర్త, కుటుంబసభ్యులు కా వాలని తాను గొడవ చేస్తే ఈనెల 19న తిరిగి భీమడోలు తీసుకువచ్చాడని, మోహన్ వల్ల తన జీవితం నాశనమయ్యిందని వాపోయింది. మోహన్‌పై చర్యలు తీసుకోవాలని కోరినా న్యాయం జరగలేదని ఆరోపించింది. దీంతో తీవ్ర మనోవేదన, అవమాన భారంతో భార్యాభర్తలిద్దరూ చనిపోతున్నట్టు, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని సూసైడ్ నోట్ రాయగా గ్రామంలో ఈ లేఖ సంచలనం కలిగించింది. గుంటూరు ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరు చికిత్స పొందుతున్నారని, అక్కడ నుంచి వచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమో దు చేస్తామని ఎస్సై షేక్ మదీనా బాషా తెలిపారు. ఈనెల 7న భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో భాను పూర్ణిమ అదృశ్యం కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం 71 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన విద్యుత్ ఉద్యోగుల సంఘం (327) తన పోరాటాలను కొనసాగిస్తోందని ఆ సంఘ ఈపీడీసీఎల్ డిస్కం అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు నాయక్ అన్నారు.
హాస్టల్ ప్రాంగణం పూడ్చివేత
హాస్టల్ ప్రాంగణం పూడ్చివేత


