రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నరసాపురం రూరల్: చెట్టును బైక్ ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం పేరుపాలెం బీచ్ రోడ్డులో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల వివరాల ప్రకారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన మల్లుల దుర్గా ప్రసాద్ (23), కుడుపూడి సాయికృష్ణ, కవురు ప్రవీణ్ బీచ్‌కు వెళ్ళి తిరిగి బైక్ పై వస్తుండగా అదుపు తప్పి కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మెగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు.


