అప్రమత్తంగా ఉండాలి
నరసాపురం రూరల్: మోంథా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో తీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని కేపీ పాలెం, పేరుపాలెం ఉన్నత పాఠశాలలతో పాటు, మెట్రేవు, మోళ్ళపర్రు, లైన్ పల్లవపాలెం, పాతపాడు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు మొగల్తూరు తహసీల్దార్ రాజ్ కిషోర్ తెలిపారు. పునరావాస కేంద్రాలను నరసాపురం ఆర్డీవో దాసిరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కిషోర్ రెడ్డి పరిశీలించి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తే వారికి ఆహరం అందించేందుకు వంట గ్యాస్, కూరగాయలు, నిత్యావసరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


