ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: నవంబర్ 7 నుంచి 10 వరకూ విశాఖపట్నంలో 7వ ఏపీ అంతర జిల్లాల సీనియర్ మెన్, ఉమెన్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది మహిళలు పోటీలకు తరలివచ్చారు. ఎంపిక పక్రియ అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి ఆద్వర్యంలో కోశాధికారి కె.మురళీకృష్ణ జట్టుకు ఎంపికై న క్రీడాకారుల పేర్లు వెల్లడించారు. బి.లీలావతి, బి.భవానిదేవి, ఏ టాలీఅనిత, జి.నాగదేవి, టి.జ్యోతి, పి.నాగవినయశ్రీ, పి.ప్రవల్లిక, పి.జయశ్రీ,, ఆర్.మహతి, వి.నిఖిలరెడ్డి, ఎం.నీరజాలాస్య, డి.సాయిభవాని, పి.నందిని, ఎ.పూర్ణచంద్రిక, వి.యామిని ఎంపికయ్యారు.
పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
పెంటపాడు: సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల సెలక్షన్ ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయలో ఆదివారం నిర్వహించారు. వివరాలను అసోషియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికై న వారిలో సాయిరాం, అహ్మద్ ఆలీషా, అన్నవరంరెడ్డి, శివతేజ రెడ్డి, తేజా కృష్ణారెడ్డి, సత్యకిరణ్, ఆదిత్య రెడ్డి, గణేష్, జోసఫ్, ఈశ్వర్‌తేజ, సందీప్, తేజ వివేక్ లోకేష్, శివకృష్ణ ఉన్నారు. కార్యక్రమంలో కోశాధికారి మురళీకృష్ణ, చింతకాయల సత్యనారాయణ, వెలగల సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు.
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనసేన కార్యకర్తలు రోడ్ల దుస్థితిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. గవరవరం, కృష్ణంపాలెం, ఈవిడిపాలెం, గంగన్నగూడెం, గొల్లగూడెం, యర్రంపేట గ్రామాలకు చెందిన జనసేన కార్యకర్తలు తమ గ్రామాలలోని ప్రధాన రహదారుల దుస్థితిని తెలియజేస్తూ ఆయా గ్రామాలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ పదవుల కోసమే కాదు ప్రశ్నించడానికి కూడా అంటూ ఫ్లెక్సీలు కట్టారు. శ్రీమన కూటమి ప్రభుత్వంలో రోడ్ల దుస్థితి నుంచి విముక్తి కల్పించండి అని డిప్యూటీ సీఎంకు సందేశం పంపించారు.
ఏలూరు రూరల్: అంతర జిల్లాల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా అథ్లెట్ రంజని గోల్డ్‌మెడల్ సాధించిందని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో పెదవేగిలో పోటీలు జరిగాయి. 400 మీటర్ల పరుగు, 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో రెండు బంగారు పతకాలు, 4 ఇన్‌టూ 100 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్ సాధించిందన్నారు.
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక


