కొల్లేరుకు ముంపు ముప్పు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు ముంపు ముప్పు

Oct 26 2025 6:47 AM | Updated on Oct 26 2025 6:47 AM

కొల్ల

కొల్లేరుకు ముంపు ముప్పు

కొల్లేరుకు ముంపు ముప్పు అప్రమత్తంగా ఉన్నాం

పెదఎడ్లగాడి వంతెన వద్ద శనివారం 2.47 మీటర్ల నీటి మట్టం నమోదైంది. మోంథా తుపాను కారణంగా ఎగువ నుంచి భారీ నీరు చేరితే ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల ఇక్కడ వంతెన వద్ద డెక్క తొలగించాం. తిరిగి పేరుకుపోయింది. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నాం.

– ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు

కై కలూరు: కొల్లేరుకు వరద ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఐదు రోజులుగా విస్తార వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మోంథా తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లేరు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వర్షపు నీటికి స్థానికంగా అధిక వర్షాలు తోడవడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది. తుపానుతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చితే భారీ నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొల్లేరుకు చేరే వరద నీటిని సముద్రానికి పంపే పెద ఎడ్లగాడి వంతెన వద్ద గురప్రుడెక్క పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో మొత్తం 122 గ్రామాలున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరులోకి చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. వివిధ డ్రెయిన్ల ద్వారా చేరుతున్న వరద నీరు మండవల్లి మండలం పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి, పోల్‌రాజ్‌ డ్రెయిన్లకు చేరుతోంది. అక్కడ నుంచి నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రానికి చేరాలి. పెదఎడ్లగాడి నుంచి ఉప్పుటేరు వరకు చానలైజేషన్‌ జరగకపోవడంతో లక్షా 10 వేల క్యూసెక్కుల నీటికి కేవలం 10 వేల క్యూసెక్కుల నీరే సముద్రంలోకి ప్రవహిస్తోంది.

గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క

వరద నీటిని సముద్రానికి చేరవేసే పెదఎడ్లగాడి వంతెన వద్ద మొత్తం 56 ఖానాలకు ఇంచుమించు అన్ని ఖానాల్లో గురప్రుడెక్క పేరుకుపోయింది. ఇటీవల పలు పర్యాయాలు డెక్కను తొలగిస్తున్న తిరిగి ఖానాల వద్ద పేరుకుపోతోంది. యంత్రాలు, మనుషులు ఇలా రెండు పద్ధతుల్లో తూడు తొలగింపులు విఫలమవుతున్నాయి. డెక్క కారణంగా నీటి ప్రవా హం తగ్గి సమీపంలో గ్రామాలను ముంచెత్తుతోంది. ప్రస్తుతానికి పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.47 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ఇది 3.5 మీటర్లకు చేరితే లోతట్టు గ్రామాలు నీట మునుగుతాయి. కొల్లేరు పరివాహక గ్రామాలన్నీంటిలో వర్షపునీరు భారీగా చేరడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

పెనుమాకలంక రహదారిలో రాకపోకలు బంద్‌

విస్తార వర్షాల కారణంగా పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకలంక చేరే రహదారి పూర్తిగా కొల్లేరు నీటిలో మునిగిపోయింది. దీంతో ఐదు రోజులుగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. అంతకుముందు కూడా ఇదే పరిస్థితి రహదారిలో కొనసాగింది. ప్రమాదకరమైనప్పటికీ ప్రజలు పడవలపై గ్రామాలకు చేరుతున్నారు. ఈ రహదారిలో ఓ బడా రైతు వందల ఎకరాలను అక్రమంగా సాగు చేస్తున్నా పట్టించుకోని ఫారెస్టు అధికారులు పెనుమాకలంక రహదారి నిర్మాణానికి అడ్డుతగులుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎత్తులో రోడ్డు పనులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

పెద ఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు మూత

మండవల్లి: పెదఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు మూసి వేసినట్లు తహసీల్దార్‌ కె గోపాల్‌ శనివారం పేర్కొన్నారు. పెదఎడ్లగాడి వద్ద కొల్లేరుకు ఎగువనున్న డ్రెయిన్లు రామిలేరు, తమ్మిలేరు, బుడమేరుల నుంచి వచ్చిన నీటి కారణంగా నిండు కుండలా మారింది. దీంతో పెనుమాకలంక రహదారిపై సుమారు మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు సాగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డును మూసివేసినట్లు తహసీల్దార్‌ చెప్పారు.

ఎగువ నుంచి భారీగా చేరుతున్న వర్షపు నీరు

పెద ఎడ్లగాడి వంతెన వద్ద 2.47 మీటర్ల నీటి మట్టం

మోంథా తుపాను హెచ్చరికతో అధికారులు అప్రమత్తం

ఐదు రోజులుగా పెనుమాకలంక రహదారిలో రాకపోకలు బంద్‌

పెద ఎడ్లగాడి వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క

కొల్లేరుకు ముంపు ముప్పు 1
1/2

కొల్లేరుకు ముంపు ముప్పు

కొల్లేరుకు ముంపు ముప్పు 2
2/2

కొల్లేరుకు ముంపు ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement