శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైనరోజు అయినప్పటికీ నాగులచవితి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాల్లో భక్తులు స్వల్ప సంఖ్యలో కనిపించారు. ఇదిలా ఉంటే స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలో ఉన్న చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. దాంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని రోడ్లన్నీ గుంతలతో అధ్వానంగా ఉండడంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ రోడ్డులో స్థానిక టౌన్ ఆసుపత్రి వద్ద ఉన్న పెద్ద గుంత, అలాగే ఆర్‌ఆర్ రైస్‌మిల్లు వద్ద చిప్స్ లేచిపోవడంతో వాహనాలు జారి పడిపోతున్నాయి. అలాగే పెనుమదం రోడ్డులో గుంతలో పడి ఓ మహిళ మృతి చెందింది. దీంతో నియోజకవర్గంలో రోడ్ల అధ్వాన పరిస్థితులపై సెప్టెంబర్ 17న ‘ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు’ శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎట్టకేలకు శనివారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేట్ హైవే (ఎస్‌హెచ్) నిధులు రూ.1.50 కోట్లతో టౌన్ ఆసుపత్రి వద్ద శ్రీనిధి రెస్టారెంట్ నుంచి దాదాపు పెనుమదం రోడ్డులో గగ్గిపర్రు రోడ్డు వరకూ నిర్మాణం చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
కాళ్ల: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కె.షాలేంరాజు (15) మృతికి విద్యుత్ తీగలు తగలడం కారణంగా తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన విషయం తెలిసి హుటాహుటిన కోపల్లెకు వస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు.
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం


