ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు

Oct 26 2025 6:47 AM | Updated on Oct 26 2025 6:47 AM

ప్రకృ

ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు

ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు లారీ ఢీకొని మహిళ మృతి టెట్‌ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయులను మినహాయించాలి

భీమవరం: రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వై నూకరాజు చెప్పారు. భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎఫ్‌ఎంటీ మాస్టర్‌ ట్రైనర్స్‌ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు బయోకంట్రోల్‌ పద్ధతులు, జీవామృతం, ఘనజీవామృతం, కీటకనాశక తయారీ విధానాలు వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయశాఖాధికారులు, ఎఫ్‌ఎంటీ మాస్టర్‌ ట్రైనర్స్‌, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

ఆగిరిపల్లి : లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అడవినెక్కలంలో చోటు చేసుకుంది. ఎస్సై శుభ శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఎన్టీఆర్‌ జిల్లా నున్న గ్రామానికి చెందిన దేవరశెట్టి అప్పారావు, తన భార్య ప్రమీల దేవి (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై మండలంలోని నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డులోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుండగా అడవినెక్కలం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమీల దేవి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం: టెట్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని, ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షుడు హరికృష్ణ, అసోసియేట్‌ అధ్యక్షురాలు శ్రీవల్లి శనివారం ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ప్రభుత్వం టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం మినహా సుప్రీంకోర్టు ఉత్తర్వులలో ఏమున్నాయి, ఎవరికి వర్తిస్తాయి, కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటనేది సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుపర్చాలని చూడడం దారుణమన్నారు. ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉత్తర్వులు తీవ్రంగా కలచి వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. 20 నుంచి 30 ఏళ్లు పైబడి సర్వీస్‌ పూర్తి చేసిన అనేకమంది ఉపాధ్యాయులు ఈ వయస్సులో టెట్‌ ఉత్తీర్ణత విషయంలో ఒత్తిడి గురవుతున్నారని, పదోన్నతులకు కూడా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ వర్తింపజేయడం సహేతుకం కాదని, విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలన్నారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు 1
1/1

ప్రకృతి వ్యవసాయ పద్ధతులే మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement