గంజాయి పట్టివేత
తణుకు అర్బన్: తణుకు కొండాలమ్మ పుంత రోడ్డులో నిషేధిత గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి సమాచారంతో రెవెన్యూ, పోలీసులు నిర్వహించిన దాడిలో 7గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 4 కేజీల 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపారు. ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన పాలాడి భానుప్రకాష్, తణుకుకు చెందిన కాకరపర్తి బాలాజీ, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన కాకరపర్తి గణపతి, నల్లాకులవారిపాలెంనకు చెందిన పితాని వజయబాబు, తణుకుకు చెందిన గుబ్బల ఉదయ్‌ప్రసాద్, బొడ్డు షారోన్, ఖండేటి సత్యనారాయణ అలియాస్ సత్యలను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు.
బువ్వనపల్లిలో ఈగల్ టీమ్ తనిఖీలు
నిడమర్రు: బువ్వనపల్లిలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం మేరకు ఎలైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ( ఈగల్) టీమ్ సభ్యులు శనివారం వేకుమజామున బువ్వనపల్లి గ్రామంలోని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, ఏలూరు నుంచి వచ్చిన 20 మంది బృంద సభ్యులతో పాటు డ్యాగ్ స్కాడ్, స్థానిక పోలీస్ సిబ్బందితో సుమారు 3 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి లేదని నిర్ధారించకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆక్వా చెరువుల మీద పని చేసేందుకు ఒరిస్సా నుంచి వచ్చే కూలీల వద్ద గంజాయి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఈ ఆకస్మిక తఖీలు నిర్వహించినట్లు ఈగల్ టీమ్ సభ్యులు తెలిపారు. అనంతరం గణపవరం ఇందిరమ్మ కాలనీల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సీఐలు ఎం.రవీంద్ర, రజనీకుమార్, ఎస్సైలు రమేష్, సుఽధీర్, ఫణికుమార్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.


