తీరంలో ‘అల’జడి
నరసాపురం: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్‌లో సందర్శకుల రాకపై నిషేధాజ్ఞలు విధించారు. కార్తీకమాసం పురస్కరించుకుని బీచ్‌లోకి సందర్శకుల రద్దీ ఎక్కువయ్యింది. అయితే బీచ్ వద్ద సముద్ర అలలు ప్రమాదకరంగా ఉండటంతో స్నానాలు చేయడానికి అనుకూల పరిస్థితులు లేవు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేట బోట్లకు లంగరు పడింది. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లను తీరానికి తరలిస్తున్నారు. అధికారులను ఆర్డీఓ దాసి రాజు అప్రమత్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్‌రూట్ ఏర్పాటు చేశారు. నరసాపురంలో ఉద యం నుంచి ఎడతెగని వాన కురిసింది. శివారు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై మోకాలు లోతులో నీరు నిలిచిపోయింది.
భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్‌ఎస్ ఫి ర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నాలుగు డీఏలు ప్రకటించాల్సి ఉండగా కేవలం ఒక డీఏ మాత్రమే ప్రకటించడం ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి రామారావు, బి.రెడ్డి దొర ప్రకటనలో విమర్శించారు. డీఏ బకాయిలను నాలుగు విడతల్లో 2027 ఫిబ్రవరి వరకు చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జనవరి 2024 నుంచి రావాల్సిన డీఏనే 2027 వరకు చెల్లింపులు చేస్తే ఇంకా ప్రకటించాల్సిన మూడు డీఏలను ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ఆయా డిమాండ్ల సాధనకు ఏపీటీఎఫ్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కొయ్యలగూడెం: పొగాకు సీజన్ ముగుస్తున్నా తమ వద్ద ఉన్న బేళ్లను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా నోబిడ్లు అధికంగా రావడం వారి నిరసనకు కారణమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఓ వైపు పొగాకు పంట సీజన్ ప్రారంభమైందని, పెట్టుబడుల కోసం తమ వద్ద ఉన్న పొగాకును అమ్మితే తప్ప వేరే మార్గం లేదన్నారు. వేలం కేంద్రానికి తీసుకువచ్చిన బేళ్లను కిలోకు రూ.60కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల ప్రాతినిధ్యం పెరిగితే ధరలు పెరిగే అవకాశం ఉందని రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,–2 కేంద్రాల్లో సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మిగిలి ఉందని, త్వరగా కొనుగోలు చేయాలని ఈడీకి విన్నవించినట్టు చెప్పా రు. త్వరలోనే ట్రేడర్స్‌తో సమావేశ నిర్వహించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఈడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తీరంలో ‘అల’జడి


