చంద్రబాబుతో ప్రజలకు తీరని అన్యాయం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం రూరల్: రాష్ట్రంలో దోచేసిన సొ మ్ములను సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఇంటికి తరలిస్తూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గురువారం మండలంలోని వెంకట్రామన్నగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నా డు జగన్ ఎంతో సమర్థవంతంగా రాష్ట్రానికి 17 మె డికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. 2023లోనే ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. మరో రెండు మెడికల్ కళాశాలలు పూర్తి కాగా, 10 మెడికల్ కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ కళాశాలల్లో వైద్య విద్యకు ఏటా రూ.13 వేల నుంచి రూ.17 వేలు ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నారు. తద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉండేదన్నారు. అయితే కూ టమి ప్రభుత్వం వాటిని 33 ఏళ్ల లీజుతో ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. దీనిద్వారా మెడికల్ సీటు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు పలుకుతుందని, తద్వారా దోచుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారని కొట్టు ఆరోపించారు. ఇది లా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు నెలలకోసారి రాష్ట్ర ప్రజలకు ముఖం చూపిస్తున్నా రని విమర్శించారు. జిల్లా కేంద్రం పేకాట క్లబ్‌లకు కేరాఫ్‌గా మారిందని పవన్ కళ్యాణ్ డీఎస్పీపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. డిప్యూటీ స్పీకర్ ర ఘురామకృష్ణరాజు డీఎస్పీకి వత్తాసు పలకడం శో చనీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగించాలని కోరుతూ గవర్నర్‌కు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.


