గృహయోగం లేనట్టేనా?
సౌకర్యాలు మెరుగుపరచాలి
కొత్తవి మంజురు కాలేదు
● కూటమి పాలన ఏడాదిన్నర దాటినా పేదలకు మంజూరుకాని ఇళ్లు
● గత వైఎస్సార్ ప్రభుత్వంలో 1,961 ఇళ్లు మంజూరు
పెంటపాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. ఇప్పటివరకు పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్త ప్రభుత్వ పాలనలో ఇప్పట్లో గృహయోగం కనిపించడం లేదని అర్హులైన ప్రజలు నిట్టూర్పు వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో పెంటపాడు మండలంలో 1,961 జగనన్న ఇళ్లు మంజూరు కాగా అందులో 1,489 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతావి వివిద దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఇవి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
కూటమి హామీలు ఓట్ల కోసమే
కూటమి నాయకులు ఎన్నికలకు మందు 3 సెంట్లు చొప్పున పేదలకు ఇంటి స్థలం ఇస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర గడిచాక తాజాగా ఒక ప్రకటన చేసింది. సొంత స్థలం ఉన్నవారు దరఖాస్తు చేసుకొంటే ఇల్లు మంజూరు చేస్తామనడంతో ఇంటి స్థలాల కోసం, ఇల్లు మంజూరుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో 670 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారికి కూడా ఇల్లు మంజూరు చేయడం లేదు. వీరిలో అర్హులను ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎంత మందికి ఇళ్లు మంజూరు చేస్తారో తెలియడం లేదు. ఇక స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు ఏదీ చేయలేదు.
జగన్ హయాంలో నెరవేరిన సొంతింటి కల
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సెంటున్నర స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించుకొనేందుకు రూ.1.80 లక్షలతో మెటీరియల్, ఆర్థిక సాయం అందించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేని ప్రాంతంలో పేదలు ఇల్లు లేకుండా ఉండకూడదని కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి భూములు కొనుగోలు చేసి మరీ లే అవుట్‌లు ఏర్పాటు చేసింది. దీంతో చాలా గ్రామాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకొని సంతోషంగా ఉంటున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా ఊర్లు వెలిసేలా గృహాలు మంజూరు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగానే దాదాపు 60 శాతం గృహాలు పూర్తయి గృహప్రవేశాలు చేశారు. మిగతావి నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడానికి ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అదనంగా ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు వివిధ నిర్మాణ దశలో నాలుగు విడతలుగా అందించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వాటిని పూర్తిచేయాలని, లేకుంటే పథకం రద్దు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గృహ నిర్మాణాల్లో కొద్దిగా కదలిక వచ్చింది. అయితే బిల్లుల చెల్లింపులు జరపడంలో జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
జగనన్న కాలనీలో సౌకర్యాలు మెరుగుపరచాలి. ఇప్పటికీ రహదారులు, డ్రెయినేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత వర్షాకాలంలో నడుం లోతు వరకు నీళ్లు చేరాయి. ఇంటివద్ద బురదతో నిండిపోయింది. పాములు, విష సర్పాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– ముప్పిడి మల్లేశ్వరి, జగనన్న లబ్ధిదారు, ఉమామహేశ్వరం
కొత్త గృహాలు మాత్రం మంజూరు కాలేదు. సొంత స్థలాలు ఉన్నవారు ఆన్‌లైన్ దరఖాస్తు చేశారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేస్తారు. ఒక్కొక్క ఇంటికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.2.80 లక్షలకు పెంచుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇళ్లు పూర్తి చేయకపోతే రద్దు అవుతాయి.
– ప్రశాంత రెడ్డి, ఇన్‌చార్జి ఏఈ, హౌసింగ్‌శాఖ
గృహయోగం లేనట్టేనా?
గృహయోగం లేనట్టేనా?
గృహయోగం లేనట్టేనా?
గృహయోగం లేనట్టేనా?


