
శ్రీవారి క్షేత్రంలో కార్తీక సందడి
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో కార్తీకమాసం సందడి మొదలైంది. తొలిరోజు బుధవారం చినవెంకన్న ఆలయానికి విచ్చేసిన భక్తుల్లో అధిక శాతం మంది, స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలోని చెట్టు వద్ద కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు. అలాగే క్షేత్రపాలకుని ఆలయంలో అర్చకులు శివదేవునికి విశేష అభిషేకాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏటీఎంల వద్ద పహారాకు సిబ్బందిని నియమించాలని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఆర్‌కే హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ లేకపోవడం వలన చోరీలు, నిరక్షరాస్యులైన వారు, వృద్ధులు మోసాలకి గురవుతున్నారని అన్నారు. బ్యాంకర్లు తొలుత ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినప్పటికీ ఆపై వదిలేశారని దీంతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఆర్‌బీఐ గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అంబుడ్స్‌మెన్, గవర్నర్లకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు హనుమంతరావు తెలిపారు.