క్షీరారామలింగేశ్వరస్వామి ఖాతాకు చేరిన నగదు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి కార్తీకమాస నిత్యాన్నదానం కమిటీ ఆధ్వర్యంలో ఉన్న నిల్వ సొమ్ము ఆలయానికి జమ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 19వ తేదీన ‘విరాళాలు దేవస్థానం ఖాతాలోకి వెళ్లేనా’ శీర్షికతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన పాత కమిటీ సభ్యులు శ్రిఖాకొల్లు వెంకన్న, శిడగం సతీష్ రూ.7,18,333 చెక్కు, రూ.62,101 నగదు రూపంలో మొత్తం రూ. 7,80,434 ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావుకు అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఆలయ శాశ్వత అన్నదాన నిధికి ఎఫ్‌డీఆర్‌లో రూ.30 లక్షలు, క్యాష్ బుక్‌లో రూ.9,26,105 ఉన్నట్లు చెప్పారు. పాత కమిటీ జమ చేసిన నగదుతో నేటికి మొత్తం అన్నదాన నిధికి రూ.47,06,539 వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అతి త్వరలో స్వామివారి అన్నదాన నిధికి రూ.50 లక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రూ.47 లక్షలకు చేరిన నిత్యాన్నదాన నగదు
క్షీరారామలింగేశ్వరస్వామి ఖాతాకు చేరిన నగదు


