వైఎస్ జగన్‌ను కలిసిన కారుమూరి
తణుకు అర్బన్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి పలు విషయాలపై చర్చించారు.
భీమవరం: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిల్లారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. వచ్చే నెల 3 నుంచి కార్మికులు చేపట్టనున్న సమ్మె సన్నాహాల్లో భాగంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిర్వహించిన ఆందోళనలో మాట్లాడారు. ఆందోళనల్లో భాగంగా 25న బైక్ ర్యాలీ, 27న మునిసిపల్ రీజినల్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి, 29, 30 తేదీల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట దీక్షలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబరు 3 నుంచి చేపట్టే సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలు, రైతులు, అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. వరి పొలాలు ముంపునకు గురైతే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్‌పీఎంలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్‌ఎస్ పిటిషన్ల పరిష్కారాలు తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా బుధవారం సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ ఎల్పీఎంలు ఇంకా జిల్లాలో 3800 పెండింగ్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్పీఎంలకు శనివారం లోపుగా దరఖాస్తులు చేయించాలని అన్నారు. 3వ ఫేజ్ రీ సర్వే చేస్తున్న గ్రామాలు టైం లైన్ ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలని అన్నారు.
భీమవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభను గుర్తించి వెలికి తీసేందుకు కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ అన్నారు. భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం), ఏపీ సైన్స్ సిటీ, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఎపీ కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే కౌశల్ పోస్టర్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సత్తా చాటాలన్నారు. కౌశల్ కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఈ నెల 24 లోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 98496 66417, 94919 70676 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన కారుమూరి
వైఎస్ జగన్‌ను కలిసిన కారుమూరి


