వైద్య విద్యను దూరం చేసే కుట్ర
పెనుగొండ: కూటమి ప్రభుత్వ పాలనలో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బుధవారం పోడూరు మండలం తూర్పుపాలెంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో వైద్య విద్య పేదలకు ఖరీదుగా మారనుందన్నారు. ప్రజలు కలసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ పాలనలో మెడికల్ కళాశాలలే రాలేదని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించి కూటమి ప్రభుత్వం అభాసు పాలైందన్నారు. గత ఏడాది పులివెందులలో మెడికల్ సీట్లు కేటాయిస్తే చేయలేమంటూ కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఇపుడు వాటి ప్రైవేటీకరణకు తెరతీసిందన్నారు. ఇది కేవలం వారి నాయకులు సంపాదన కోసమేనని ఆరోపించారు. 16 నెలలు కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. కోటి సంతకాలు సేకరణ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, సర్పంచ్‌లు గుబ్బల ఉషా వీర బ్రహ్మం, ఇళ్ల లక్ష్మీ చంద్రిక, జక్కంశెట్టి చంటి, సుంకర సీతారామ్, జక్కంశెట్టి శ్రీరామ్, పార్టీ సీనియర్ నాయకులు నల్లిమిల్లి బాబిరెడ్డి, పిల్లి రుద్ర ప్రసాద్, పోతుమూడి రామచంద్రరావు. కుక్కల సూరిబాబు, దంపనబోయిన బాబూరావు, జెంట్రీ శ్రీను, జే సునీల్ వర్మ, ఏసురత్నం, పూరీళ్ల శ్రీను, కేశవరపు గణపతి, కుడిపూడి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


